ఆంధ్ర ప్రదేశ్
కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. వారికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు సరఫరా చేసిన నెయ్యి పూర్తి గా కల్తీనే అని ఇటీవల సిట్ అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో తక్కువ ధరకు నెయ్యి ఇస్తామని వివిధ సంస్థలు కాంట్రాక్టులు పొందాయి. తిరుపతితో పాటు రాష్ట్రంలోని పవిత్ర పుణ్య క్షేత్రాలకు నెయ్యి పేరుతో.. డాల్డాలో కెమికల్స్ కలిపి సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు.
అయితే ఈ కేసు విచారణ చివరి దశలో ఉండగా.. కీలక పరిణామం చోటు చేసుకుంది. బోలే బాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్, విపిన్, వైష్ణవి డెయిరీ సీఈవో వినయ్ కి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సిట్ అధికారుల విచారణ కొనసాగుతున్నందుకు విచారణకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.