సినిమా

సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించండి ఏపీ ప్రభుత్వానికి టీఎఫ్‌సీసీ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినందుకు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులైన మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (AP FDC) లకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

ఈ విషయంలో, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు మరియు ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, మరియు గౌరవనీయ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారిని కలిసి, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తెస్తూ, వైజాగ్, తిరుపతి, రాజమహేంద్రవరంలో స్టూడియోల నిర్మాణం/ మౌలిక సదుపాయాల ఏర్పాటు మరియు నిర్మాతలు, కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు గృహనిర్మాణం కోసం భూమి కేటాయింపు వంటి ప్రతిపాదనలను సమర్పించామని మరియు ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేగవంతమైన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా పూర్తి సహకారం మరియు మద్దతును అందించామని.

ఇంకా, నంది అవార్డులను పునరుద్ధరించాలని మరియు పెండింగ్లో ఉన్న అవార్డులనుకూడా ఇవ్వాలని మేము అభ్యర్థించామని తెలియజేసారు. కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో త్వరిత చర్య తీసుకోవాలని వినయపూరిత అభ్యర్ధనతో మేము ఎదురుచూస్తున్నామని, దీని ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు సాగుతుంది, అని తెలియజేసారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button