News
HCA: నిధుల గోల్‌మాల్ కేసులో కీలక పరిణామం

HCA నిధుల గోల్‌మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 51.29 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో జరిగిందన్న ఈడీ ఆరోపించింది. HCA మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్‌పై ఈడీ అభియోగాలు మోపింది. కాంట్రాక్టులు అప్పగించినందుకు క్విడ్ ప్రో కోగా సురేందర్‌కు 3 కంపెనీలు రూ.90 లక్షలు చెల్లించాయి. సురేందర్ భార్యకు చెందిన KB జ్యువెలర్స్ ఖాతాకు డబ్బులు జమ అయ్యాయి.