తెలంగాణ
Telangana: మందుబాబులకు గుడ్న్యూస్.. కింగ్ఫిషర్ బీర్లపై సంస్థ కీలక ప్రకటన

Telangana: మందుబాబులకు గుడ్న్యూస్.. తెలంగాణలో మళ్లీ కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. రాష్ట్రంలో కింగ్ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వాటి తయారీ సంస్థ అయిన యునైటెడ్ బ్రేవరీస్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం బీర్ల సరఫరాలపై సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
బీర్ల ధరల పెంపు, పాత బకాయిల చెల్లింపులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుబీఎల్ వివరించారు. ప్రభుత్వ హామీతో కింగ్ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.