ఆంధ్ర ప్రదేశ్
AP News: ఇంటర్ విద్యార్ధులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..

AP News: ప్రభుత్వ ఇంటర్ విద్యార్ధులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న లక్షా48వేల419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేశ్ లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.