తెలంగాణ
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ

Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో తిరుపతన్న పాత్రపై.. దర్యాప్తు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని చెప్పింది. దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలమని.. అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని అనుకోవడం లేదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది.