ఆంధ్ర ప్రదేశ్
Pulivendula ZPTC Election: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు ప్రారంభం

Pulivendula ZPTC Election: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది పోటీలో ఉన్నారు. పులివెందులలో 10 వేల 601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24 వూల 606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు విడుదల చేయనున్నారు. పోలింగ్‌కు 14 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్‌తో పాటు సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశారు.



