KKR vs GT: ఇవాళ కేకేఆర్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్

KKR vs GT: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇవాళ బిగ్ ఫైట్ ఉండనుంది. అయితే ఈ 39వ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈడెన్ గార్డెన్ పిచ్ ను పరిశీలిస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కంటే సెకండ్ బ్యాటింగ్ చేసినవారికి మంచి రిజల్ట్ వస్తాయని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. అటు కేకేఆర్ అలాగే గుజరాత్ టైటాన్స్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఏకంగా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఇప్పటివరకు గుజరాత్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ పై చేయి సాధించింది. నాలుగు మ్యాచ్ లలో గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. కేకేఆర్ మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ లో విక్టరీ కొట్టింది. ఈ రెండు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ రిజల్ట్ రాకుండానే ముగిసింది.
ఇక ఇవాళ సొంత గడ్డపై కేకేఆర్ ఆడనుంది. దాంతో ఆ జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్ ను తట్టుకోవడం కేకేఆర్ వల్ల కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
7 మ్యాచ్ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఏడింట్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉన్న కోల్కతా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా GT, KKR ఒక మ్యాచ్లో గెలుపొందాయి. ఒకటి రద్దైంది. దీంతో ఇవాళ జరగనున్న ఈ హోరాహరీలో ఎవరు గెలుస్తారో అని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.