చిరంజీవి - అనిల్ మూవీలో విక్టరీ వెంకటేష్?

మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా సినీ ప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ముహూర్తం ఇప్పటికే జరిగింది. చిరంజీవి ఈ చిత్రంలో తన అసలు పేరైన ‘శివశంకర వరప్రసాద్’ పాత్రలో కనిపించనున్నారని అనిల్ తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా, అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, మరో ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో చర్చలో నడుస్తోంది.
చిరు – అనిల్ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీం వెంకీని సంప్రదించినప్పటికీ, ఆయన సమ్మతి ఇంకా రహస్యంగానే ఉంది. చిరంజీవి, వెంకటేష్ మధ్య ఉన్న బలమైన స్నేహ బంధం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆశపడుతున్నారు.
వెంకీ 75వ సినిమా ఈవెంట్లో చిరు పాల్గొన్నప్పుడు, “మెగాస్టార్ వెనక కత్తి పట్టుకుని నడిచే రోల్ చేయాలనుంది” అని వెంకీ సరదాగా అన్నారు. ఇప్పుడు ఆ ఆలోచన సాకారమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అనిల్‌తో వెంకీకి కూడా మంచి అనుబంధం ఉంది. వీరి కలయికలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ స్నేహం, అనుబంధం కారణంగా వెంకీకి ఈ పాత్ర వచ్చినట్లు సమాచారం.