తెలంగాణ

నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న అక్రమ గంజాయి రవాణా..

నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పల్లె పట్టణం అని తేడా లేకుండా గంజా మత్తుకు చిత్తవుతుంది యువత. ఆంధ్ర వయా ఇందూరు కేంద్రం అడ్డాగా బిజినెస్ కొనసాగిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు గంజా స్మగ్లర్లు. సర్కారు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నా అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతుంది. కాసులకు కక్కుర్తి పడి యువకుల జీవితాలను నాశనం చేస్తుంది గంజాయి ముఠా. కొంత కాలంగా రాష్ట్రంలో గంజాయిపై అధికారులు చర్యలు చేపట్టడంతో కొత్త దారిలో అమ్మకాలు ప్రారంభించింది. ఆంధ్ర నుంచి గుట్టుగా చప్పుడు కాకుండా గంజాయి తీసుకువస్తూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సాలూరా రహదారితో పాటు నిజాంసాగర్‌ నుంచి మద్నూర్‌ వరకు కొత్తగా ఏర్పాటైన జాతీయ రహదారి వెంట మహారాష్ట్రకు జోరుగా గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి దందా జోరుగా సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు గంజాయి మాత్రమే కాకుండా అల్పాజోలం వంటి ఇతర మత్తు పదార్థాలు జిల్లాలో హట్ కేకులా అమ్మకాలు జరుగుతున్నాయి. కొంత కాలంగా ఉమ్మడి జిల్లా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారంటే జిల్లాలో బిజినెస్ ఏ విధంగా అర్దం చేసుకొవచ్చు. అయితే ముఖ్యంగా మహరాష్ట్ర, కర్నాటక సరిహద్దు కావడం రైల్వే లింక్ ద్వారా రవాణాకు అనుకూలంగా మార్చుకున్నారు స్మగ్లర్‌లు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ మీదుగా కొంతమంది యువకులతో గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతకు ముందుగా మత్తుకు బానిసను చేసి వారితోనే సరఫరా చేయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button