జాతియం
Earthquake: ఉత్తరాదిలో వరుస భూకంపాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ

Earthquake: ఉత్తరాది రాష్ట్రాలను భూ ప్రకపంనలు హడలెత్తించాయి. బిహార్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లో తెల్లవారుజామున భూమి కంపించింది. బిహార్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4గా నమోదు కాగా.. ఢిల్లీలో 4.3గా నమోదైంది. జనం భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూ ప్రకంపనలపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.