తెలంగాణ
నాంపల్లి కోర్టులో ఎర్రోళ్ల శ్రీనివాస్ బెయిల్ మంజూరు..

Errolla Srinivas: బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విధులను అడ్డుకున్నారని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే నాంపల్లి పోలీసులు ఆయన్ను మూడుసార్లు విచారణకు పిలిచారు. విచారణకు రాకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
వాదనలు విన్న కోర్టు.. శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 5 వేల రూపాయల ఫైన్‌తో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అంతకు ముందు బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, వివేక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కలిసి పరామర్శించారు.