జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జడ్చర్ల: అవినీతి ఆరోపణలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై గురువారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో అధికారులపై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో, ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు ప్రారంభమయ్యాయి.
“చేతులు తడవనిదే పనులు జరగవు” అనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్న ఈ కార్యాలయంలో, మధ్యాహ్న భోజన విరామం అనంతరం రికార్డులు, రిజిస్ట్రేషన్ పద్ధతులపై అధికారులు బహుళ కోణాల్లో పరిశీలన చేపట్టారు. కార్యాలయ కార్యకలాపాలను బహిరంగంగా పరిశీలించిన ఏసీబీ అధికారులు, తనిఖీలు ముగిసిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఇప్పటికే జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు నెలకొన్నాయి. చిన్న ఉద్యోగుల నుంచి పెద్ద అధికారుల వరకూ కమీషన్లే ప్రధాన ఆధారం అనే ఆరోపణలు వినిపించగా, “ఎవరైనా పట్టుబడారా?” అన్న ఉత్కంఠ పట్టణ ప్రజల్లో నెలకొంది. అవినీతిపై ఈ దాడులు వాస్తవంగా మారితేనే సామాన్యులకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అవినీతి ఆరోపణలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ వ్యవహారాల్లో అధికారులపై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
చేతులు తడవనిదే పనులు జరగవనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్న ఈ కార్యాలయంలో, మధ్యాహ్న భోజన విరామం అనంతరం రికార్డులు, రిజిస్ట్రేషన్ పద్ధతులపై అధికారులు పలు కోణాల్లో పరిశీలన చేపట్టారు. కార్యాలయ కార్యకలాపాలను ఏసీబీ అధికారులు బహిరంగంగా పరిశీలించారు.