Renu Desai: అకీరా సినిమా ఎంట్రీ రూమర్లకు రేణూ దేశాయ్ చెక్

Renu Desai: పవన్ కల్యాణ్ సినిమా ‘ఓజీ’లో అకీరా ఎంట్రీ ఇస్తున్నాడని, అలాగే రామ్ చరణ్ నిర్మాణంలో అకీరాకు గ్రాండ్ లాంచ్ ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ రూమర్లపై తాజాగా రేణూ దేశాయ్ స్పందించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాలో పవన్ కొడుకు అకీరా కీలక పాత్రలో కనిపిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. అటు రామ్ చరణ్ నిర్మాణంలోనూ అకీరాకు బిగ్ ఎంట్రీ ప్లాన్ ఉందన్న టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘ఇవన్నీ పుకార్లు మాత్రమే.
అకీరాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉంటే.. అతను స్వయంగా చెబితే, నేనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తా. అప్పటి వరకు ఇలాంటి రూమర్లు ఆపాలని కోరుకుంటున్నా’ అని స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాంటి వార్తలపై ఆమె ఖండించినప్పటికీ మళ్లీ వైరల్ కావడంతో రేణూ మరోసారి చెక్ పెట్టారు. అకీరా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూడాల్సిందే.