ఆంధ్ర ప్రదేశ్
Gudivada Amarnath: జడ్పీటీసీ నూకరాజు హత్య ప్రభుత్వ వైఫల్యమే

Gudivada Amarnath: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైపల్యం చెందిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కొయ్యూరు జడ్పిటిసి నుకరాజు మృతి శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని మంత్రి విమర్శించారు. గిరిజన సమస్యల మీద అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నూకరాజును చంపడం దారుణమని అమర్నాథ్ అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు ఉపాధి కరువైందని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలను స్వాగతిస్తామన్న గుడివాడ అమర్నాథ్ వాటి వల్ల జరిగే ప్రయోజనాల మీద చర్చ జరగాలని అన్నారు.



