తెలంగాణ
KCR: సోదరి సకలమ్మ మృతదేహానికి కేసీఆర్ నివాళి

KCR: తన సోదరి సకలమ్మ పార్ధివదేహానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. మరోవైపు.. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత కూడా సకులమ్మకు నివాళులర్పించారు. కాసేపట్లో పూడూర్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
కేసీఆర్ ఐదో సోదరి చీటీ సకలమ్మ.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ విభాగంలో చేరిన సకలమ్మ.. నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో సకలమ్మ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.