తెలంగాణ
Revanth Reddy: ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి వచ్చిన వాళ్లకే కీలక పదువులు

Revanth Reddy: పనిచేసే వాళ్లకే పదవులు దక్కుతాయన్నారు సీఎ రేవంత్ రెడ్డి. గాంధీ భవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకారనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జక్కిడి శివచరణ్ రెడ్డి రాష్ట్ర యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఢిల్లీ నుంచి కాదు.. గల్లీ నుంచి వచ్చిన వాళ్లకే కీలక పదవులు ఉంటాయన్నారు. ఫ్లెక్సీలు కట్టి, దండాలు పెట్టే వారికి పదవులు రావని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ నేతలదే అని అన్నారు.