ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించాం

Nara Lokesh: రాష్ట్ర ప్రయోజనాల కోసం బేషరతుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పదవులు అడగలేదు, రాష్ట్రాన్ని కాపాడాలని మాత్రమే కోరామని తెలిపారు మంత్రి. విశాఖ ఉక్కు పరిరక్షణకు 13 వేల కోట్లు తెచ్చామని, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నామని గుర్తు చేశారు.
అలాగే రైల్వే జోన్ తీసుకురావడంతో పాటు పోలవరం, అమరావతికి నిధులు తెచ్చామన్నారు లోకేష్. కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి చాలా అవసరమని, అందుకే తాము బేషరతుగా ఎన్డీఏలో చేరామన్నారు మంత్రి లోకేశ్. ఐదేళ్లలో వైసీపీ తీసుకురాలేని నిధులు తాము 9 నెలల్లో తెచ్చామన్నారు. రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.