కర్నూల్ జిల్లాలో చెలరేగిపోతున్న ఎర్రమట్టి మాఫియా

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో ఎర్రమట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను తవ్వి ఎర్రమట్టిని తరలిస్తున్నాడు కేటుగాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారుల మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా మైనింగ్ అధికారులు కూడా ఎర్రమట్టి మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆలూరు మండలం హత్తిబేలగల్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే ఓ వ్యాపారవేత్త. జెసిబిల సాయంతో కొండలని సైతం తవ్వి ఎర్ర మట్టిని విచ్చలవిడిగా అమ్ముకుంటూ లక్షల గడిస్తున్నారు. డబ్బు ఉందన్న అహంకారంతో అధికారులను, పొలిటికల్ లీడర్స్ నోరు మూయించాడు ఈ కేటుగాడు. భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పి మేనేజ్ చేస్తూ విచ్చలవిడిగా ఎర్రమట్టిని అమ్ముకున్నాడు. అయితే ఇంత జరుగుతున్నా ఏ అధికారి కూడా వారిని నిలదీసే సాహసం చేయలేకపోతున్నారు.
అయితే ఎవరైనా అధికారులు కాస్త ధైర్యం చేసి అబ్జెక్షన్ చేస్తే వారిపై పొలిటికల్ ప్రెజర్ తీసుకొచ్చి.. ట్రాన్స్ ఫర్ చేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ మాఫియా వెనక అదే గ్రామానికి చెందిన MDU ఆపరేటర్ జగదీష్ స్వామి, VRO హస్తముందని అక్కడి గ్రామ ప్రజల టాక్. అంతేకాదు తాహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఏం చేయలేరని ఎదైనా చెప్పాలనుకుంటే జిల్లా అధికారులకు చెప్పాలంటున్నారు.
ఇటీవలే జిల్లా మైనింగ్ అధికారులు ఆలూరు, హత్తిబేలగల్ రెండు గ్రామాల ప్రాంతాల్లో పర్యటించారు. అయినప్పటికీ వారు కూడా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేక వెళ్లిపోయారు. ఇదే అదునుగా ఎర్రమట్టి కేటుగాడు రెచ్చిపోయి తనకున్న సొంత వాహనాలు జెసిబి మరియు లారీల సహాయంతో రాత్రి, పగలు తరలిస్తున్నాడు.
ఇతను ఆంధ్రాలోనే కాకుండా కర్ణాటకలోనూ ఈ ఎర్రమట్టిని తరలిస్తూ కోట్లు గడిస్తున్నాడు. ఇకనైనా మైనింగ్ అధికారులు కళ్ళు తెరిచి ఇలాంటి ఎర్ర మట్టి కేటుగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుని అడ్డు అడ్డుకట్ట వేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.