‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.. రీ-రిలీజ్‌తో మళ్లీ మ్యాజిక్

Jagadeka Veerudu Athiloka Sundari: మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఐకానిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. 35 ఏళ్ల తర్వాత ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. రీ-రిలీజ్ సందర్భంగా చిరంజీవి, అశ్వనీదత్, రాఘవేంద్రరావు నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 1990లో ప్రభంజనం సృష్టించింది. చిరంజీవి మాట్లాడుతూ, “శ్రీదేవితో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. 27 రైటర్స్, ఇళయారాజా సంగీతం, విన్సెంట్ విజువల్స్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా మార్చాయి. రీ-రిలీజ్లో శ్రీదేవిని మిస్ అవుతున్నాం,” అన్నారు.
అశ్వనీదత్ భావోద్వేగంతో, “చిరంజీవి, రాఘవేంద్రరావు గారికి రుణపడి ఉంటాను,” అన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ, “ఇళయారాజా సంగీతం, ‘అందాలలో అహో మహాదయం’ పాట ఈ చిత్రాన్ని అమరం చేశాయి. రీ-రిలీజ్‌తో మళ్లీ ఇంద్రలోకంలో విహరిస్తున్నాం,” అన్నారు. రామ్ చరణ్ వీడియో బైట్‌లో, “ఈ డ్రీమ్ టీం మళ్లీ రాదు. సీక్వెల్లో రింగ్ రహస్యాన్ని నాగ్ అశ్విన్ విప్పాలి,” అని డిమాండ్ చేశారు.