జాతియం
పార్లమెంట్ ఆవరణలో టీ కాంగ్రెస్ ఎంపీల నిరసన

2వ రోజు పార్లమెంట్ ఆవరణలో టీ కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. తెలంగాణ రైతాంగానికి కేంద్రం యూరియాను విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. యూరియా కొరత వల్ల తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని ఎంపీలు నినాదాలు చేశారు. టీ కాంగ్రెస్ ఎంపీల నిరసన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శనతో ఎంపీలు నిరసన తెలిపారు.



