ఆంధ్ర ప్రదేశ్
Tirupati: ర్యాగింగ్ ఆరోపణలు.. ఎస్వీ వర్సిటీ ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థుల ఫిర్యాదుతో విచారణ జరిపిన ర్యాగింగ్ కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది. కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా వర్సిటీ వీసీ నరసింగరావు విశ్వనాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే విశ్వనాథ రెడ్డి ఇంట్రాక్షన్ సెషన్ పేరుతో సీనియర్లతో ర్యాగింగ్ చేయించారని జూనియర్ విద్యార్థులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.



