శ్రీ చైతన్య స్కూల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

కడపలో విద్యార్థిని అనుమానాస్పద మృతిపై పేరెంట్స్, బంధువులు ఆందోళకు దిగారు. శ్రీ చైతన్య స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాపకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పిన పేరెంట్స్‌కు స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పింది. అయితే పాపను ఆసుపత్రిలో విగత జీవిగా చూసిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాప మెడ చుట్టూ ఉరి వేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయని, ఎందుకు దాచిపెట్టారని తల్లిదండ్రులు ప్రశ్నించారు.
పాపను స్కూల్ యాజమాన్యమే చంపేసిందని ఆరోపించిన పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఆసుపత్రి నుంచి పాప మృత దేహాన్ని స్కూల్‌కు తీసుకెళ్లి అక్కడే తేల్చుకుంటామని పేరెంట్స్, బంధువులు ముందుకు కదిలారు. అయితే పోలీసులు స్కూల్ ముందు ధర్నా చేయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థిని పేరెంట్స్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థిని మృతదేహంతో రింగ్‌రోడ్డుపై ధర్నాకు దిగారు.



