తెలంగాణ
Suryapet: దారుణం.. పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు

Suryapet: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చేయని నేరాన్ని ఒప్పుకోమని పోలీసులు వేధిస్తుండటంతో యువకుడు పోలీస్ స్టేషన్‌లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గోపి అనే వ్యక్తి రైతు వేదికలో నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. రైతు వేదికలోని విలువైన ఇంటర్నెట్ సామాన్లు, కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి.
చోరీకి గురైన విషయాన్ని గోపి వ్యవసాయ అధికారులకు తెలియజేయడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గోపిపై అనుమానంతో విచారణకు పిలించారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసుల వేధిస్తుండటంతో గోపి ఆత్మాహత్యాయత్నం చేశారు. గోపిని గమనించిన పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తన్నారు. పోలీసులు తనను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు.



