సినిమా

సూర్య ప్లాప్ సినిమా రీ రిలీజ్.. సీక్వెల్ ప్లాన్?

సూర్య నటించిన ఒక సినిమా రీ రిలీజ్ హంగామా మొదలైంది. ఐతే 11 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా అప్పట్లో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఐతే ఆ తర్వాత మాత్రం ఆ సినిమా గురించి డిస్కస్ చేస్తూ వచ్చారు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా డైరెక్టర్ కూడా అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ రీ రిలీజ్ పై ఆసక్తిగా ఉన్నాడు. ఇంతకీ ఏ సినిమా గురించి ఇదంతా అంటే అదే సూర్య, లింగుసామి కాంబినేషన్ లో వచ్చిన అంజాన్.

అంజాన్ 2014లో రిలీజ్ అయ్యింది. తెలుగులో సికిందర్ గా డబ్ అయింది. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేయగా, హీరోయిన్ గా సమంత నటించింది. ఐతే తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు. అప్పట్లో సూర్య మంచి ఫాం లో ఉండగా అతని ఫాం కి ఈ సినిమా బ్రేక్ వేసినట్టు అయ్యింది. లింగుసామి ఆ సినిమా రిలీజ్ టైంలో కొన్ని కారణాల వల్ల ఎడిటింగ్ సరిగా చేయలేదని ఐతే ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ ఆకట్టుకుందని అన్నారు.

లింగుసామి అంజాన్ సినిమా రీ రిలీజ్ ని తనకి ప్లస్ అయ్యేలా చేసుకోవాలని చూస్తున్నారు. రామ్ తో ది వారియర్ తర్వాత 3 ఏళ్లుగా లింగుసామికి మరో మూవీ ఛాన్స్ రాలేదు. ఒకవేళ అంజాన్ రీ రిలీజ్ లో హిట్ అయితే దానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడటా ఈ డైరెక్టర్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button