సినిమా

Suriya-Venky: సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో సంచలన బయోపిక్..!

Suriya-Venky: లక్కీ భాస్కర్‌తో సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి మరో సంచలన ప్రాజెక్ట్‌తో రెడీ అవుతున్నారు. ఈసారి తమిళ స్టార్ హీరో సూర్యతో జత కట్టబోతున్నారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న హాట్ టాక్ ఏంటంటే ఈ సినిమా ఓ బయోపిక్‌గా రానుందట!

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘796 CC’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇండియాకు మారుతి కార్లను తీసుకొచ్చిన అద్భుత జర్నీని ఈ సినిమాలో చూపించనున్నారు. మారుతి కార్ ఇంజిన్ సామర్ధ్యాన్ని సూచించే ‘796 CC’ టైటిల్ పర్ఫెక్ట్ చాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ చిత్రంలో సూర్య సరసన అందాల తార కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్. ఈ కొత్త కాంబినేషన్ ప్రేక్షకులకు ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని అంటున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది. కీర్తి సురేష్ నిజంగానే ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారా? అనేది త్వరలో తేలనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button