సూర్య 45వ సినిమా: ‘కరుప్పు’ టైటిల్ రివీల్‌తో ఫ్యాన్స్ ఉత్సాహం!

Suriya: కోలీవుడ్ స్టార్ సూర్య 45వ సినిమా ‘కరుప్పు’ టైటిల్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ప్రీ-లుక్ పోస్టర్‌తో అంచనాలు పెంచింది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ గురించి మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి.
తమిళ సినిమా స్టార్ సూర్య తన 45వ చిత్రంతో మరోసారి అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ టైటిల్‌తో పాటు విడుదలైన మాస్ ప్రీ-లుక్ పోస్టర్ సూర్య వింటేజ్ మాస్ లుక్‌ను సూచిస్తూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది.
డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో, సాయి అభ్యంకర్ సంగీతంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సూర్య, త్రిష కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీలో యోగి బాబు, ఇంద్రన్స్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం యాక్షన్‌తో కూడిన ఎమోషనల్ డ్రామాగా రూపొందుతుందని తెలుస్తోంది. సూర్య బర్త్‌డే సందర్భంగా మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయని అభిమానులు ఎదురుచూస్తున్నారు.