తెలంగాణ
నేడు సుప్రీంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ

నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై.. అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. జస్టిస్ గవాయి, వినోద్ చంద్రన్ ధర్మాసనం వాదనలు, ప్రతివాదనలు విననుంది. ఇక సుప్రీం విచారణ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఉత్కంఠ నెలకొంది.
ఇక పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేయగా, గత విచారణలో రీజనబుల్ టైం అంటే ఎంత అని ప్రభుత్వ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.



