అంతర్జాతీయం

Donald Trump: అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ కు షాక్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు భారీ షాక్ తగిలింది. విదేశాలకు అందజేయాల్సిన 2 బిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని నిలిపివేస్తూ ఆయన పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను యూఎస్ సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దిగువ కోర్టు తీసుకున్న డిసిషన్ సరైందేనని తెలిపింది.

తాత్కాలిక నిషేధ ఉత్తర్వును పాటించడానికి గడువు ఇప్పటికే ముగిసినందున ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో దిగువ కోర్టులు స్పష్టం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ఈ తీర్పుతో నిధుల విడుదలకు అనుమతి లభించినప్పటికీ దీనికి సరైన కాలపరిమితిని నిర్ణయించలేదు. దీంతో దీనిపై మరోసారి దిగువ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button