జాతియం
కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది సుప్రీంకోర్టు. తమిళనాడులో నటుడు, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. విషాద సంఘటనపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది.



