Delhi Air Pollution: ఢిల్లీ గాలిలో ప్రమాదకర సూపర్ బగ్స్

Delhi Air Pollution: వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియాను జేఎన్‌యూ సైంటిస్టులు గుర్తించారు. యాంటీ బయాటిక్స్‌కు సైతం లొంగని సూపర్ బగ్ అని నిర్ధారించారు. ఢిల్లీలోని మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో బాక్టీరియా జీవం పోసుకుంటున్నట్లు గుర్తించారు. WHO పరిమితి కంటే 16 రెట్లు అధిక ప్రమాదకరం అని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. న్యూమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని సూచించారు.
ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ప్రమాదకరస్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఇవాళ ఉదయం రాజధాని నగరంలో ఓవరాల్ ఏక్యూఐ లెవెల్స్ 384గా నమోదైంది. నగరంలోని పలు ఎయిర్ మానిటరింగ్ కేంద్రాల్లో గాలి నాణ్యత సూచిక 400 మార్క్‌ను దాటి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. పలు ప్రాంతాలు అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు.
ఆరోగ్యంగా ఉన్నవారిపై వీటి ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ సూపర్‌బగ్స్ వల్ల చికిత్సకు లొంగని ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. పర్యావరణంలోని ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రభుత్వం తక్షణమే పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని జేఎన్‌యూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.



