సినిమా

Sitara - Mahesh: మరో సూపర్ హిట్ యాడ్ లో సూపర్ స్టార్, సితార

Sitara – Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబుకు, ఆయన కూతురు సితారకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సితార తన వీడియోలతో పాటు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే సితార ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇంత చిన్న ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ చేసిన మొదటి భారతీయ స్టార్ట్ కిడ్‌గా నిలిచింది.

తన డ్యాన్స్‌, ఇతర యాక్టివిటీస్‌తో అందరినీ ఆకర్షిస్తున్న సితార , డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నిర్వహిస్తోంది. ఇక కెరీర్ లో ముందుకు సాగుతూ తండ్రి తగ్గ తనయ అనిపించుకుంటోంది. అయితే తాజాగా సితార, మహేష్ బాబుకి సంబంధించిన యాడ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఫేమస్ క్లాత్ షోరూం యాడ్ లో మహేష్, సితార అదరగొట్టారు. ఇందులో మహేష్ చాలా హ్యాండ్ సమ్‌గా ఉన్నాడు. చెప్పాలి అంటే పాతికేళ్ళ కుర్రాడిలా ఉన్నాడు. దీంతో మహేష్ లుక్స్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.

ఇంతకు ముందు కూడా బుల్లితెర పై సీరియల్స్ ప్రమోషన్‌లో ఇలాగే ఇద్దరు ఎంతో ఆకట్టుకున్నారు. తెలుగు కుటుంబ ప్రేక్షకులకు తన కూతురు దగ్గరవుతుందనే ఉద్దేశంతో మహేష్ ఆ ప్రచారం చేశాడట. ప్రస్తుతం వీరు చేసిన క్లాత్ షోరూం యాడ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button