ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 10న సూపర్ సిక్స్-సూపర్ సక్సెస్ విజయోత్సవ సభ

అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈనెల 10న నగర శివారులోని ఇంద్రప్రస్థ నగర్ లో ఈ సభ నిర్వహించున్నారు. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం పసుపుమయమైంది. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నాయకులు పాల్గొననున్నారు.

దీంతో అనంతపురంలో ఎక్కడ చూసినా టిడిపి, బిజెపి , జనసేన పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఆయా పార్టీల అధినేతలకు ముఖ్య నాయకులు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. నగరం అంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. మరోవైపు సభ స్థలం వద్ద కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం దాదాపు 20 ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button