ఆంధ్రా కింగ్ 3 కోట్ల లాజిక్ పై దర్శకుడు క్లారిటీ!

Andhra King Taluka: రామ్ పోతినేని, ఉపేంద్ర నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో హీరోకు 3 కోట్లు ఇచ్చే సీన్‌పై ప్రేక్షకులు లాజిక్ అడిగారు. అయితే దీనిపై దర్శకుడు మహేశ్ బాబు పి స్పందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంలో ఉపేంద్ర పాత్ర పేరు సూర్య. వరుసగా తొమ్మిది ఫ్లాపులతో ఆర్థికంగా దెబ్బతిన్న సూర్యకు రామ్ పాత్ర 3 కోట్లు ఇస్తుంది. దీనిపై “ఇంత పెద్ద స్టార్‌కు 3 కోట్లు లేవా?” అని కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీనిపై దర్శకుడు మహేశ్ బాబు పి స్పష్టమైన వివరణ ఇచ్చారు.
“సూర్య మాట తప్పని వ్యక్తి. తొమ్మిది వరుస ఫ్లాపుల వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లకు జరిగిన నష్టాలను తన జేబులోంచి భరించాడు. అప్పటి కాలంలో హీరోలు అలవాటే అది. అందుకే ఆయన దగ్గర డబ్బు మిగల్లేదు” అని చెప్పారు. అంతేగాక, “ప్రతి విషయాన్ని సీన్లలో చూపించే అవకాశం ఉండదు, డైలాగుల ద్వారా చెప్పాం. అందుకే కొంతమందికి కనెక్ట్ కాలేదు” అని దర్శకుడు అన్నారు. ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని కూడా తెలిపారు.



