గోవిందాపై భార్య ఆరోపణలు వైరల్!

బాలీవుడ్ నటుడు గోవిందా భార్య సునీత అహూజా తన భర్తపై సీరియస్ కామెంట్లు చేశారు. ఇటీవల ఈ జంట మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. విడాకుల దరఖాస్తు చేసుకున్నట్లు పుకార్లు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు విడిపోరని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సునీత పాడ్‌కాస్ట్‌లో గోవిందా తప్పులను ప్రశ్నించారు.
బాలీవుడ్ స్టార్ గోవిందా భార్య సునీత అహూజా తాజా కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ దంపతుల మధ్య సంబంధాలు దిగజారినట్లు వార్తలు వచ్చాయి. కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు పుకార్లు కూడా వ్యాపించాయి. అయితే కుటుంబ సభ్యులు ఈ జన్మలో విడిపోరని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సునీత అహూజా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ గోవిందా తప్పులను లేవనెత్తారు. ‘చిన్నతనంలో తప్పులు సహజం.
నేను కూడా చేశాను, గోవిందా కూడా చేశాడు. కానీ వయసు వచ్చాకా, భార్య పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు తప్పులు చేస్తారు?’ అని ప్రశ్నించారు. మరో మాటలో గోవిందా తన జీవితంలో భార్యతో కంటే హీరోయిన్లతోనే ఎక్కువ సమయం గడిపాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో తనకు ఏమీ అర్థం కాలేదని, తెలిసే సరికి జీవితం ముందుకు వెళ్లిపోయిందని సునీత చెప్పుకొచ్చారు. ఈ కామెంట్లతో గోవిందా-సునీత జంట విడిపోతుందనే అంచనాలు మరింత బలపడ్డాయి.



