తెలంగాణ
Kavitha: బీసీ బంద్.. రోడ్డుపై బైఠాయించిన కవిత

Kavitha: బీసీ బంద్కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. జాగృతి కార్యకర్తలతో కలసి రోడ్డుపై బైఠాయించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు.
దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్కు ప్రకటించడం నవ్వులాటగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.



