అంతర్జాతీయం
Peshawar: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడులు.. పారామిలిటరీ కార్యాలయంలో పేలుళ్లు

Peshawar: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో వరుస పేలుళ్లతో కలకలం రేగింది. ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయం వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి దిగడంతో ఇద్దరు పారా మిలిటరీ సిబ్బంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కార్యాలయ గేట్ వద్ద మొదటి పేలుడు సంభవించగా, వెంటనే సైకిల్ స్టాండ్ వద్ద మరో పేలుడు చోటుచేసుకుంది.
ముగ్గురు ఉగ్రవాదులు కార్యాలయాన్ని ముట్టడించడంతో భద్రతా బలగాలు ప్రతికూల చర్యలు చేపట్టి కాల్పులు జరిపాయి. ప్రాంతమంతా లాక్‌డౌన్ విధించగా, బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో రక్షణ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు.



