తెలంగాణ
Sudhakar Reddy: ఆపరేషన్ సిందూర్‌పై రేవంత్ వ్యాఖ్యలు ఖండించిన సుధాకర్ రెడ్డి

Sudhakar Reddy: ఆపరేషన్ సిందూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కర్నాటక, తమిళనాడు బీజేపీ సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దేశ భద్రత విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దేశ సమగ్రత, శాంతి కోసం జరిగిన ఆపరేషన్ సిందూర్ మీద విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
ఆల్ పార్టీ ఎంపీలు విదేశాలకు వెళ్లి ఆపరేషన్ సిందూర్ విజయాన్ని, పాక్ దురాగతాలను ఎండగడుతున్న సమయంలో కాంగ్రెస్ ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమన్నారు. దిగజారిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ తన పరువు తీసుకుంటుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణమే కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.