అంతర్జాతీయం
Sudan: సూడాన్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 1000 మందికిపైగా మృతి

Sudan: ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వెయ్యి మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని సూడాన్ ఆర్మీ ధృవీకరించింది. కొండచరియలు విరిగిపడి ఓ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.



