అంతర్జాతీయం

భారతీయ అమెరికన్, చాట్‌జీపీటీ విమర్శకుడు సుచీర్ బాలాజీ ఆత్మహత్య.. స్పందించిన మస్క్

కృత్రిమ మేధపై పరిశోధన చేసిన భారత సంతతికి చెందిన సుచీర్ బాలాజీ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేగుతోంది. శాస్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లో సుచీర్ విగతీజీవిగా పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆయన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది మాత్రం తెలియరాలేదు. ఇందులో ఏదైనా కుట్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు. కాగా, రెండు నెలల కిందటే తాను పనిచేసిన సంస్థపై బాలాజీ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఓపెన్ఏఐలో కృత్రిమ మేధపై పనిచేసిన భారతీయ అమెరికన్ యువకుడు సుచీర్ బాలాజీ అనూహ్యరీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శాస్‌ఫ్రాన్సిస్కోలోని నవంబరు 26న బాలాజీ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. తాను నివాసం ఉంటోన్న బుచానన్ స్ట్రీట్‌ అపార్ట్‌మెంట్‌లో సుచీర్ విగతీజీవిగా పడి ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ప్రాథమిక విచారణలో ఘటన వెనుక కుట్ర ఉందనడానికి ఎటువంటి అనుమానాస్పద ఆధారాలు లభ్యం కాలేదని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీస్ విభాగం అధికార ప్రతినిధి రాబర్ట్ ర్యూక్ తెలిపారు. బాలాజీ లింక్డన్ ప్రొఫైల్ ప్రకారం.. ఓపెన్ఏఐలో నవంబరు 2020 నుంచి ఆగస్గు 2024 వరకు రిసెర్చ్‌గా పనిచేశారు.

బాలాజీ ఆత్మహత్యపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. దీనిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ అల్టమన్‌, ఎలాన్ మస్క్‌ మధ్య సుదీర్ఘ కాలంగా వైరం నడుస్తోంది. వాస్తవానికి ఇరువురూ కలిసి ఈ సంస్థను 2015లో ప్రారంభించారు. విబేధాలు రావడంతో మూడేళ్ల తర్వాత అందులో నుంచి మస్క్ బయటకు వచ్చేసి.. సొంతంగా xAI పేరుతో స్టార్టప్ ప్రారంభించారు. ఓపెన్ఏఐ గుత్తాధిపత్యం సాగిస్తోందని గత నెలలోనే మస్క్ విమర్శల గుప్పించారు.

ఇక, సుచీర్ సైతం కాపీరైట్ చట్టం ఉల్లంఘనకు పాల్పడుతోందని ఓపెన్ఏఐపై అక్టోబరులో బహిరంగంగా ఆరోపణలు చేశారు. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ మాట్లాడుతూ.. ‘నేను నమ్మినదాన్ని మీరు విశ్వసిస్తే, మీరు కంపెనీ నుంచి బయటకెళ్లాలి’ అని వ్యాఖ్యానించారు. అలాగే, చాట్‌జీపీటీ వంటి సాంకేతికత వల్ల ఇంటర్నెట్‌కు నష్టం జరుగుతోందని అన్నారు. ఏడాదిన్నర చాట్‌జీపీటీ కోసం సహా సంస్థలో తన నాలుగేళ్ల అనుభవం గురించి ఎక్స్ (ట్విట్టర్)లో సుచీర్ వెల్లడించారు.‘‘నాకు మొదట్లో కాపీరైట్ చట్టం మొదలైన వాటి గురించి పెద్దగా తెలియదు కానీ GenAI కంపెనీలపై దాఖలైన అన్ని వ్యాజ్యాలను చూసిన తర్వాత ఆసక్తి పెరిగింది.. నేను సమస్యను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.. శిక్షణ పొందిన డేటాతో పోటీపడే ప్రత్యామ్నాయాలను సృష్టించగలం.. ప్రాథమిక కారణంతో AI ఉత్పత్తులకు న్యాయమైన ఉపయోగం ఉందనే నిర్ణయానికి వచ్చాను’’ బాలాజీ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button