Subham: సమంత ‘శుభం’ సినిమా ఎలా ఉందంటే..

Subham: సమంత తొలి నిర్మాణంలో ‘శుభం’ సినిమా ఎలా ఉంది? ఆడవాళ్ల సీరియల్ అడిక్షన్‌ను టార్గెట్ చేసిన ఈ కథ ప్రేక్షకులను మెప్పించిందా? పూర్తి రివ్యూ చూద్దాం!
వైజాగ్‌లోని భీమునిపట్నంలో కేబుల్ టీవీ ఆపరేటర్ శ్రీను (హర్షిత్ రెడ్డి), స్నేహితులతో సంతోషంగా జీవిస్తాడు. శ్రీను పెళ్లి శ్రీవల్లి (శ్రియా కొంతం)తో జరుగుతుంది. కానీ, ఫస్ట్ నైట్ రోజు శ్రీవల్లి సీరియల్ చూస్తూ దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంది. ఊరంతా సీరియల్ సమయంలో ఆడవాళ్లు ఇలాగే హడలెత్తిస్తారు. పరిష్కారం కోసం మాత మాయ (సమంత)ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.
దర్శకుడు ప్రవీణ్ కండ్రెగుల సీరియల్స్ చుట్టూ ఫన్ జనరేట్ చేస్తూ మెప్పించాడు. తొలి 15 నిమిషాల్లోనే కథలో వేగం పెంచాడు. ఫస్టాఫ్‌లో సీరియల్ సన్నివేశాలతో నవ్వులు పూయించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తి రేపినా, సెకండాఫ్ కాస్త నీరసంగా సాగింది.
క్లైమాక్స్‌లో సమంత ఎంట్రీతో వేగం అందుకుంది. ‘ఆడవాళ్లను గౌరవించాలి’ అనే సందేశం ఆకట్టుకుంది. హర్షిత్, శ్రియా నటన బాగుంది. క్లింటన్ సెరెజో సంగీతం, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టున్నాయి. ప్రమోషన్ బాగా చేస్తే థియేటర్‌కు ఆడియన్స్‌ను రప్పించే చిత్రమిది.