ఆంధ్ర ప్రదేశ్
ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలి

గుంటూరు జిల్లా పోలకంపాడులో దారుణం జరిగింది. ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలైంది. నమ్మినవాడు నట్టేట ముంచడంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు.. మనస్పర్థలతో విడిపోయారు. అక్కడి నుంచి ప్రియురాలికి.. ప్రియుడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. కలిసి దిదిగిన ఫోటోలు, వీడియోలు బయటపెడతానని యువతిని బెదిరించాడు. దీంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.



