ఆంధ్ర ప్రదేశ్
Kurnool: స్కూల్‌లో ప్రహరి గోడ కూలి విద్యార్థి మృతి

కర్నూల్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్‌లో ప్రహరి గోడ కూలి విద్యార్థి మృతి చెందాడు. స్కూల్‌లో గోడ కూలడంతో విద్యార్ధి రాఖీబ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్ధి రాఖీబ్ మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని టీజీ భరత్ హామీ ఇచ్చారు.



