Stranger Things: దూసుకుపోతున్న ‘స్ట్రేంజర్ థింగ్స్-5’ రెండో వాల్యూమ్!

Stranger Things: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్న ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్-5 రెండో వాల్యూమ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మొదటి వాల్యూమ్‌లో నాలుగు ఎపిసోడ్లు విడుదలైన తర్వాత ఇప్పుడు మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. భారత్‌లో ఉదయం నుంచే అందరికీ అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓరిజినల్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ ప్రపంచవ్యాప్త ఓటీటీ ప్రేక్షకులకు అత్యంత ప్రియమైన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఇప్పుడు దాని ఫైనల్ సీజన్ అయిన సీజన్-5 స్ట్రీమింగ్ జరుగుతోంది. మిగతా సీజన్ల మాదిరిగా ఒకేసారి అన్ని ఎపిసోడ్లు విడుదల చేయకుండా ఈసారి వాల్యూమ్స్‌గా విభజించి రిలీజ్ చేస్తున్నారు. గత నెల మొదటి వాల్యూమ్‌గా నాలుగు ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చి సాలిడ్ ప్రతిస్పందన పొందాయి.
ఇప్పుడు రెండో వాల్యూమ్‌గా మూడు ఎపిసోడ్లు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యాయి. భారత్‌లో ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి ఈ ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి. అభిమానులు ఎప్పటి నుంచో ఈ ఎపిసోడ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విడుదలతో వారి ఆత్రుత తీరిపోయింది. ప్రస్తుతం ఈ సీజన్ బాగా ట్రెండ్ అవుతుంది.



