వ్యాపారం

Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు, కొన్ని దిగ్గజ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 324 పాయింట్లు నష్టపోయి 83వేల 246 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ 108 పాయింట్లు కోల్పోయి 25వేల 585 వద్ద ముగిసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. అంతర్జాతీయంగానూ సెంటిమెంట్ బలహీనంగా ఉంది. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదనను కొన్ని యూరప్ దేశాలు వ్యతిరేకించడంతో, వాటిపై పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button