Stock Market: భారత్-అమెరికా చర్చల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: భారత్, అమెరికా మధ్య జరగనున్న కీలక వాణిజ్య చర్చల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ప్రధానంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 250 పాయింట్లు నష్టపోయి 83వేల627 వద్ద స్థిరపడింది. అదేవిధంగానిఫ్టీ 57 పాయింట్లు క్షీణించి 25వేల 732 వద్ద ముగిసింది.
ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయని భారత రాయబారి సెర్గియో గోర్ ప్రకటించడంతో దలాల్ స్ట్రీట్‌లో ఆచితూచి వ్యవహరించే ధోరణి నెలకొంది. దీంతో ట్రేడర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. స్టాక్స్‌లో ఎటర్నల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడి సూచీలకు కొంత మద్దతు ఇచ్చాయి. అయితే, ట్రెంట్, లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ), ఇండిగో వంటి షేర్లలో నష్టాలు మార్కెట్లను కిందకు లాగాయి.



