వ్యాపారం
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తత వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించగా తాజాగా దాన్ని 20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో మార్కెట్లో వాణిజ్య యుద్ధ భయాలతో దేశీయ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీనికితోడు ఐటీ, మెటల్ స్టాక్స్‌లో విక్రయాలు సూచీలపై ఒత్తిడి పెంచుతున్నాయి.