వ్యాపారం
Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: చాలా రోజుల తర్వాత దలాల్ స్ట్రీట్ కళకళలాడింది. అయితే నష్టాలు.. లేదంటే ఓ మోస్తరు లాభాలకే పరిమితమైన సూచీలు.. చాలా రోజుల తర్వాత భారీ లాభాలను నమోదు చేశాయి. ఈరోజు లాభాలతో ట్రేడ్ అయిన సూచీలు.. భారీ లాభాలతోనే ముగిశాయి.
1,436 పాయింట్ల లాభంతో 79 వేల 94 వద్ద సెన్సెక్స్ ముగిసింది. మరోవైపు.. 446 పాయింట్ల లాభంతో 24 వేల 189 వద్ద నిలిచాయి. ఫైనాన్షియల్, ఆటో, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఇన్ఫోసిస్, మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి.