తెలంగాణ
నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. పాల్గొననున్న కేసీఆర్

KCR: నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఒంటి గంటకు ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొననున్నారు.
2001లో పార్టీని ఏర్పాటు చేయగా వచ్చే ఏప్రిల్ నాటికి 24ఏళ్లు పూర్తయి పాతికేళ్లలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా చేపట్టా ల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఆవిర్భావ వేడుకలు, భారీ బహిరంగ సభ నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.