తెలంగాణ

గ్లోబల్ సమ్మిట్‌లో ఆకట్టుకుంటున్న స్టాల్స్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్ దేశ, విదేశీ అతిథులను​ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలు సంస్థలు తమ ప్రొడక్ట్స్‌‌ను ప్రదర్శించాయి. సమ్మిట్‌‌ వద్ద మొత్తంగా 27 స్టాల్స్‌‌ను ఏర్పాటు చేయగా తెలంగాణ హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ నగిషీ, ఇక్కత్​ ఫ్యాబ్రిక్, చేర్యాల పెయింటింగ్స్, ఇతర హ్యాండీ క్రాఫ్ట్స్‌‌, వాటి ప్రత్యేకతల గురించి స్టాల్స్​ నిర్వాహకులు విదేశీ ప్రతినిధులకు వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button